తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో దారుణ సంఘటన వెలుగు చూసింది. పాఠాలు నేర్పించే గురువే విద్యార్ధినులతో అసభ్యకరంగా ప్రవర్తించే ఆరోపణలతో వేణుపై కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొత్తగూడెం పట్టణంలోని సింగరేణి పాఠశాలలో కొన్ని రోజులుగా విద్యార్ధినులను టీచర్ వేధిస్తున్నారని, వారి తల్లిదండ్రులు ఆరోపించారు. వారు పాఠశాల వద్ద ఆందోళనకు చేపట్టడంతో వన్ టౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని టీచర్ వేణుని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు విచారణ ప్రారంభించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ