తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మణుగూరు ప్రభుత్వ ITIలో ఈనెల 29న జాబ్ మేళా ఉంటుందని ప్రిన్సిపాల్ జీ. రవి తెలిపారు. సింగరేణి కోల్ మైన్స్ లో పని చేస్తున్న ఎస్ఎంఎస్ కంపెనీలో టెక్నీషియన్, ఆపరేటర్స్ ట్రైనింగ్ ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా జరుగుతుందన్నారు. ఐటీఐలో ఎలక్ట్రిషన్, ఫిట్టర్, డ్రాప్స్ మెన్ సివిల్, సర్వేయర్, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ కోర్సులు పూర్తి చేసిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ