తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 20 (తెలుగు వెలుగు) : ఈనెల 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సబ్ జూనియర్స్,జూనియర్,యూత్ విభాగాల్లో మంచిర్యాల జిల్లాలో "టైసన్ కప్ స్టేట్ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్" జరుగుతుందని జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు కోచ్ జి.ఈశ్వర్ మంగళవారం తెలిపారు.అలాగే తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో జూనియర్ 44కేజీల నుండి 60 కేజీల 7 విభాగాల్లో రాష్ట్ర జట్టు ఎంపిక చేసి గోవాలో జరిగే జాతీయ ఓపెన్ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.కావున అర్హత కలిగిన బాక్సర్లు ఈనెల 22వ తేదీన ఉదయం 7గంటల లోపు కొత్తగూడెం లోని ప్రగతి మైదానంలో జరుగు జిల్లా స్థాయి పోటీలకు హాజరు కావాల్సిందిగా కోరారు.పూర్తి వివరాలకు కోచ్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ జీ.ఈశ్వర్ కు సెల్ నెంబర్ 7893669676 కు సంప్రదించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ