తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ పై ధ్రృష్టి సారించాలి అని ఇల్లందు నియోజకవర్గం శాసనసభ్యులు కోరం కనకయ్య గారు తెలిపారు. ఇల్లందు మండలం ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండలం శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం లో తెలిపారు. ఈ సమావేశంలో భాగంగా అల్పపీడన ప్రభావంతో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వలన సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందువలన ప్రభుత్వ డాక్టర్స్, ANM, నర్సులు అందరు కుడా ప్రజలను చైతన్య పరచాలని, ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో సరిపడా మందులు నిల్వ ఉంచుకొవాలని సూచించారు. గ్రామాలలో లోతట్టు ప్రాంతాలలో, పురాతన కాలపు ఇళ్ళలో నివసించేవారిని గుర్తించాలని, దోమల బేడద పెరిగే అవకాశం ఉన్నందున, నిల్వ నీరు లేకుండా చుడాలని, బ్లీచింగ్, దోమల స్ప్రెయింగ్ జరిపించాలని కోరారు. విధ్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మర్రిగూడెం లాంటి విషాద వార్తలు పునరావ్రృతం కాకుండా, గిరిజన ప్రాంతాలు కావడం వలన గ్రామాలలో లైన్మెన్లు సక్రమంగా పని చేయాలని మండలంలో ఉన్న ప్రభుత్వ హస్టల్ లలో పరిశుభ్రత పాటించాలని, పిల్లలకు సక్రమంగా మెనూ అందించాలని,ఆకస్మిక తనిఖిలు ఉంటాయని,తప్పు జరిగే ఉపేక్షించే అవకాశం ఉండదని తెలిపారు. రెవిన్యూ, ఇరిగేషన్, పంచాయితి రాజ్ శాఖ, అగ్రికల్చర్ అధికారులు చెరువులు కుంటలు మత్తడి దునుకుతున్నడంతో చుట్టు పరిసర ప్రాంతాలకు చిన్న పిల్లులు రాకుండా చుడాలని, అంతర్గత, బిటి రోడ్లు గుంతలు పడిన వాటిని గుర్తించి తక్షణమే మరమ్మత్తు పనులు చెపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు మండలం MPDO ధన్ సింగ్, DSP చంద్ర భాను, అగ్రికల్చర్ ఎవో సతీష్, కొమరారంPHC డాక్టర్ లోహిత,రొంపేడ్ డాక్టర్ కమిత, విటనరి డాక్టర్ హర్షిత, రెవిన్యూ RI కామేశ్వరరావు, RWC AE బాలాజి, విధ్యుత్ AE హర్షిణి, సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ, మండలం మాజీ వైస్ ఎంపిపి మండల రాము, మండల పార్టీ అధ్యక్షుడు పులి సైదులు, మూతి క్రిష్ణ, బానోత్ శంకర్ తదితరులు పాల్గోన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ