Monday, 20 April 2026 01:35:22 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేపట్టండి.కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి

Date : 17 September 2025 11:16 AM Views : 468

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డిల్లీలో కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ స్థాపనపై చొరవ తీసుకోవాలని రాంమోహన్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసిన మంత్రి తుమ్మల. భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఎయిర్ పోర్ట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు డిల్లీలో రాoమోహన్ నాయుడు ను కలిసి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పై చర్చించారు. కొత్తగూడెం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేయగానే స్పందించి ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం సివిల్ ఏవియేషన్ తరపున ఫీజు బులిటీ సర్వే చేసినందుకు రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు.ఫీజుబులిటీ సర్వే లో ప్రతిపాదిత స్థలం ఎయిర్ పోర్ట్ నిర్మాణం కోసం అనువుగా లేనందున మరో స్థలం రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతిపాదన చేశామని అక్కడ త్వరగా ఫీజుబులిటీ సర్వే చేసి, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రి రాoమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దక్షిణ అయోధ్య గా ప్రసిద్ధి చెందిన భద్రాచలం రామాలయం దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలిపారు. జాతికి వెలుగులు అందించే సింగరేణి గనులు.. హెవీ వాటర్ ప్లాంట్..ఐటీసీ బీ. పీ.ఎల్ సంస్థలతో పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరుదైన ఖనిజ నిక్షేపాలతో అటవీ ప్రాంతంతో ఎకో టూరిజం కు కేరాఫ్ గా నిలిచింది. దేశంలోనే తొలి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కొత్తగూడెం లో ఏర్పాటు చేశాం. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం వల్ల పారిశ్రామికంగా విద్యా పరంగా టూరిజం పరంగా జిల్లా ఎంతో పురోగతి చెందే అవకాశం ఉందని, దేశ విదేశాల నుంచి భద్రాద్రి రామాలయం దర్శనానికి వచ్చే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం లో చొరవ తీసుకోవాలని రాంమోహన్ నాయుడు కు మంత్రి తుమ్మల సవివరంగా తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో చేపట్టాల్సిన పనులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని మంత్రి తుమ్మల తెలిపారు. తెలుగు బిడ్డైన రాంమోహన్ నాయుడు చొరవతో కొత్తగూడెం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కల సాకారం కానుందని మంత్రి తుమ్మల ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన లో భాగంగా కేంద్ర భారీ పారిశ్రామల,ఉక్కు మంత్రి హెచ్. డి కుమారస్వామి ని కలిసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బయ్యారం లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వచ్చిన మంత్రి తుమ్మల.ఈ అంశంపై త్వరలోనే సమావేశం అవుదామని తెలిపిన కేంద్ర మంత్రి కుమార స్వామి.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :