తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సుజాతనగర్ ప్రాంతంలో ప్రధాన రహదారిపై సెంట్రల్ లైటింగ్ లేకపోవడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. జాతీయ రహదారి కావడంతో నిత్యం తరచుగా అనేక వాహనాలు వేగంగా వెళుతూ ఉంటాయి ఇక్కడి ప్రధాన రహదారులు లైటింగ్ లేకపోవడం వలన చిమ్మ చీకట్లో పశువులు, వాహనాల రాకపోకలు తరచుగా ప్రమాదకరంగా మారాయి. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ సరైన చర్యలు తీసుకున్న పాషానపోలేదు ఇప్పటికైనా భారీ ప్రమాదాలు, నష్టం జరగకముందే సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాలని వ్యాపారస్తులు ప్రజలు కోరుతున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ