తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుజాతనగర్ ( ) ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించిన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, పేదవాడి ముఖంపై చిరునవ్వు వెలిగించడానికి నిరంతరం శ్రమించిన కార్మికుడు, జనం గుండెల్లో గూడు కట్టుకొని నిత్యం ప్రజా పూజలు అందుకుంటున్న మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు కొనియాడారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సోమవారం వేపలగడ్డ లోని వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వేపలగడ్డలో సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ జలయజ్ఞంతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన కర్షక భగీరథుడని సర్కార్ పాలనలోనే కాదు. స్నేహంలోనూ, సాయంలోనూ వై.ఎస్. రాజశేఖరరెడ్డిది ఓ అరుదైన వ్యక్తిత్వం అని కొనియాడారు. మనుషుల గుండెల్లో చిరకాలం చెరిగిపోని సంతకం ఆయన పేరని, జనహృదయ విజేత వైఎస్ 2009లో అకాల మరణం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కుదిపివేసిందని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, 108, ఉచిత కరెంటు, ఉచిత బియ్యం లాంటి ఎన్నో సేవా పథకాలను ప్రజల ముందుకు తెచ్చి అపర భగీరధుడుగా ప్రజల గుండెల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, కందుల సుధాకర్ రెడ్డి, ఉడుముల శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల రాజశేఖర్ రెడ్డి, వై.శ్రీనివాస్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, శ్రీరామిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, చిమట నాగేశ్వర రావు, నాగార్జున, కేసిరెడ్డి, అన్నపురెడ్డి శ్యాం సుందర్ రెడ్డి, పైడా ప్రసాద్, మడిపల్లి వెంకట్, బొబ్బాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ