తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : CPI(ML)న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ నాయకురాలు వీరమళ్ళ ఉమ అధ్యక్షత ఊహించగా ఏప్రిల్ 25,2025 భద్రాద్రి కొత్తగూడెం కేంద్రం లో జిల్లా సదస్సును విజయవంతం చేయాలని, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసీలపై జరుగుతున్న హత్యాకాండ ను తక్షణమే నిలిపివేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరిస్తున్న నేతలు కగార్ పేరుతో జరుగుతున్న హత్యాకాండ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి. "అఖిలభారత రైతు కూలీ సంఘం"(AIKMS), ఆల్ ఇండియా కేత్ మజ్దూర్ కిసాన్ సభ(AIKMKS) ల ఆధ్వర్యంలో ఈనెల ఏప్రిల్ 25వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో జరుగు సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాద్రి, కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోత్ ఉక్లా, కొత్తగూడెం సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి సురేందర్ లు మాట్లాడుతూ దేశంలో ముఖ్యంగా మధ్యభారతంలో ఆదివాసుల పై కేంద్ర ప్రభుత్వం దాడులు హత్యాకాండను జరుపుతూ, నిత్యం నరమేధం సృష్టిస్తూ, రక్తాన్ని ఏరులై పారుస్తున్నది. అడవుల్లో ఉన్నటువంటి సహజ అటవీ, ఖనిజ సంపదను బిజెపి ప్రభుత్వం బడా కార్పొరేట్లకు దోచిపెట్టడం కోసం ప్రతిఘటిస్తున్న ఆదివాసులను హతమారుస్తున్నారు. నాడుబ్రిటిష్ సామ్రాజ్య వాదులు అటవీ సహజ సంపదను బంగారం వజ్రాలు వగైరా సంపదను కొల్లగొట్టుకొని పోతే ఈనాటి ఈ బీజేపీ ప్రభుత్వం వారి అభిమానులైన అంబానీ, ఆదాని అయిన బడా కార్పొరేట్లకు ఈ సంపదను దోచిపెడుతున్నది.ఎదురుతిరిగిన అమాయక ఆదివాసి గిరిజనులను నిత్యం ఎన్కౌంటర్ల పేరుతో చంపి వేస్తూ, వారిని నక్సలైట్లుగా ముద్ర వేస్తూ, ప్రశ్నించిన వారిని కూడా జైల్లో నింపుతూ బేస్ క్యాంపులలో కూడా బందీలుగా నిర్బంధిస్తూ, ఆపరేషన్ కగార్ పేరుతో ఆదివాసి జాతిహననానికి బిజెపికి చెందిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి. క్రూరమైన హత్యాకాండ కు తెగబడుతున్నాయి. ఆదివాసీలు జెల్, జంగల్, జమీన్ కోసం ఉద్యమిస్తున్నారు.వారు ఈ దేశ సంపదను అటవీ సహజ వనరులను కాపాడుతున్నారు.పరిశ్రమలు పర్యాటక కేంద్రాల పేరుతో అడవులను కొల్లగొడుతున్నారు. ఈ పాలకులు.కార్పొరేట్లతో మల్టీనేషన్ కంపెనీలతో కుమ్మక్కై ఆదానీ,అంబానీలతో చేతులు కలిపి దేశ మూలవాసులైన ఆదివాసీ,గిరిజనులను నిత్యం చంపుతున్నది. మణిపూర్, అస్సాం, పంజాబ్, కాశ్మీర్ తదితర రాష్ట్రాలలో మత ఘర్షణలు రెచ్చగొట్టి అంతులేని క్రూరహింసాకాండ కొనసాగిస్తున్నదన్నారు.ఆదివాసీల పోరాటాల ఫలితంగా 1/70 చట్టం,అటవీ హక్కుల చట్టం, పెసాచట్టం, 2006 అటవీ హక్కుల చట్టం ఆదివాసుల గూడాలలో ఆదివాసులదే అధికారం అమలుకై రెండు వందల సంవత్సరాలుగా ఆదివాసులు ఉద్యమిస్తున్నారు. పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల తదిత రైతులపై నిర్బంధాన్ని మోపి రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చారు. కార్మికుల ఐక్యతను చీల్చి వారి శ్రమను దోచుకునేందుకు 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా తెచ్చారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా దేశ ప్రజలు,యువకులు, కార్మికులు,విద్యార్థులు, ఉద్యోగులు,మేధావులు పోరాడుతుంటే ఉక్కు పాదంతో అణచివేసి, ప్రశ్నించే వారిని కూడా జైల్లో బట్టి నిర్బంధిస్తున్నారని అన్నారు. జల్ జంగల్ జమీన్ ఆదివాసులకు అడవులపై పూర్తి హక్కుల ఆదివాసులకు దక్కాలని అడవుల సహజ సంపదను బలా కార్పొరేట్లకు దోచిపెట్టడాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదివాసీలపై జరుపుతున్న హత్యాకాండ దమన కాండపై సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి.పెసా చట్టం 2006 ను అమలు చేయాలి,ఆదివాసీల భూమి హక్కును ,జీవించే హక్కును, కాపాడాలని అన్నారు.ఈనెల 25వ తేదీన, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగే సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సు కామ్రేడ్స్ సనప పొమ్శయ్య,బొర్ర ఆనంద్ Aikms,తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకుల అధ్యక్షతన వ్యక్తులు జస్టిస్ చంద్రకుమార్ విశ్రాంత,హైకోర్టు న్యాయమూర్తి,కా,,పి టాన్యా అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ అధ్యక్షురాలు, కా,,ఎస్. ఝాన్సీ ఎఐకెఎంకెఎస్ కో-కన్వీనర్, కా,,ప్రసాదన్న ఎఐకెఎంకెఎస్ నాయకులు,కా,,బి.భాస్కర్ ఎఐకెఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కా,,కెమిడి ఉప్పలయ్య తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి,కా,,ఎం.ప్రతాప్ రెడ్డి ఎఐకెఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు,కా,,ఈర్ల పైడి తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు,కా,,అరెళ్ళి క్రిష్ణ ఐఎప్ టియు రాష్ట్ర అధ్యక్షులు,కా,,బానాత్ ఊక్ల ఎఐకెఎంఎస్ రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.ఈ సదస్సులో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యక్రమాలు వుంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో IFTU జిల్లా నాయకులు భూక్య కిష న్, వెంకటేశ్వర్లు,PYL జిల్లా నాయకులు బానోత్ రాజేష్, POW జిల్లా నాయకురాలు నక్క లావణ్య, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ