తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హేమచంద్రాపురం నందు గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు శుక్రవారం పోలీస్ అధికారులు,సిబ్బందికి యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ తరగతులలో కొత్తగూడెం సబ్ డివిజన్లో పనిచేస్తున్న పోలీసు అధికారులు,సిబ్బంది,ఆర్మడ్ రిజర్వు అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు. నిత్యం విధులలో నిమగ్నమై ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ శాఖలోని అధికారులు,సిబ్బంది శారీరక దృఢత్వంతో పాటు, మానసికంగా కూడా దృఢంగా ఉండే విధంగా చేయడంలో భాగంగానే యోగా తరగతులను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ తెలిపారు. యోగా,ధ్యానం వంటిని అలవాటుగా చేసుకుని నిత్యం సాధన చేస్తే మానసిక ప్రశాంతతతో పాటు దైనందిన కార్యక్రమాలలో ఉత్సాహంగా, చురుకుగా పాల్గొనవచ్చని డిఎస్పీ అన్నారు.కావున పోలీసు అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ తరగతుల ఆవశ్యకత తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, 3టౌన్ సీఐ శివప్రసాద్, అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ