తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండలం చింతల తండా పంచాయతీలో మల్టీపర్పస్ గా పనిచేస్తున్న బానోత్ తరుణ్ మంగళవారం రోజున విద్యు త్ షాక్ తో మరణించిన తరుణ్ కుటుంబాన్ని ఓదార్చిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈరోజు పోస్ట్మార్టం అనంతరం తరుణ్ అంత్యక్రియల్లో పాల్గొన్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోథ్ మంగీలాల్ నాయక్ తక్షిణ సహాయం కింద ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఇచ్చినటువంటి పదివేల రూపాయలు మంగీలాల్ కుటుంబీకులకు అందజేశారు . అలాగే తరుణ్ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని. ప్రభుత్వం తరఫునుంచి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చెప్పారని. మాలోత్ మంగీలాల్ నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ