తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా కొత్తగూడెం పట్టణానికి చెందిన న్యాయవాది యెర్రా కామేష్ ను ఐ.ఎల్.పి.ఏ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.జే.శాంసన్ నియమించారు.ఈసందర్భంగా కామేష్ మాట్లాడుతూ న్యాయవాదుల హక్కులు,న్యాయవాదులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన,సామాజిక,ఆర్ధిక సమస్యలపై నిరంతరం పోరాటం చేయడమే కాకుండా,న్యాయవాదులకు 365 రోజులు ఉచితంగా ఆన్లైన్ లో జూనియర్ సివిల్ జడ్జి,అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న న్యాయవాదులకు శిక్షణ అందిస్తున్న ఏకైక న్యాయవాద సంస్థ ఐ.ఎల్.పి.ఏ నిలుస్తుందని, మహాత్మా జ్యోతిబా ఫూలే,డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ భావజాలాన్ని ఆదర్శంగా చేసుకొని సమానత్వం,సమన్యాయం,సామాజిక సాధికారత కోసం పాటు పడతామని,ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ను జిల్లాలో బలోపేతం చేయుటకు కృషి చేస్తానని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రతీ ఒక్కరికీ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడమే కాకుండా పూలే అంబేడ్కర్ గారి ఆలోచనా విధానం,వారి భావజాలం పట్ల అవగాహన కల్పిస్తామని, మరియు చట్టాలు,హక్కుల పట్ల అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఐ.ఎల్.పి.ఏ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా నియమితులైన యెర్రా కామేష్ ను న్యాయవాదులు జే.గోపికృష్ణ, భానుప్రియసాదిక్ పాషా, అంబటి రమేష్, ఎర్రపాటి కృష్ణ, మారపాక రమేష్ కుమార్, సమంత్ తదితరులు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ