తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఈ రోజు దమ్మపేట మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు ప్రజాపాలన ప్రగతిప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో కోమాల చెరువులో నిర్వహించిన “రైతు వారోత్సవాలు” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా రైతులు ఉపాధిహామీ కూలీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఉపాధిహామీ పథకం ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలు గ్రామీణాభివృద్ధిలో పథకం పాత్రపై వివరించారు ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఉపాధిహామీ కూలీలు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలని ఎమ్మెల్యే సూచించారు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీలకు మజ్జిగ (బటర్ మిల్క్) పంపిణీ చేసి వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు.అనంతరం స్థానిక రైతువేదికలో నిర్మాణం పూర్తై పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించారు అర్హులైన పేద కుటుంబాలకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరగాలని అధికారులకు ఆదేశించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజమైన అర్హులకు చేరేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో దమ్మపేట ఎంపీడీఓBR రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ సుంకపల్లి వీరభద్ర రావు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి,స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి, ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు కక్కిరాల రమేష్, టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు చిన్నశెట్టి యుగంధర్, పగడాల రాంబాబు, మాజీ సర్పంచ్ ఆంగోతు బాలాజీ, చిన్నశెట్టి గోపి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ Dee L.కృష్ణ, కృష్ణAEE మరియు Gగోపాల్ రావు AEE కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ