తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు అనగా 13.1.2026న జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తూకారామ్ రాథోడ్ జిల్లాలోని దుమ్ముగూడెం మరియు పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగినది. వైద్య సిబ్బంది యొక్క వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. హాజరు పట్టికను పరిశీలించడం జరిగినది. ప్రతి ఒక్క వైద్య సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సమయపాలన పాటించాలని మరియు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలు అందించాలని సూచించడం జరిగినది. రికార్డులను పరిశీలించడం జరిగినది. అదేవిధంగా రక్తపరీక్ష కేంద్రాలను, ఆపరేషన్ థియేటర్లను కూడా సందర్శించి థియేటర్ నందు అత్యవసర మందులను అందుబాటులో ఉంచాలని, మరియు ల్యాబ్ లలో కూడా సరైన నివేదికలు రోగులకు అందించాలని సూచించడం జరిగినది. ఈ కార్యక్రమంలో మరియు పర్ణశాల, దుమ్ముగూడెం వైద్యాధికారులు సూపర్వైజర్లు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ