తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పోలీస్ శాఖలో పనిచేసే డ్రైవర్లు నిత్యం తమ వాహనాల కండీషన్ ను తనిఖీ చేసుకుంటూ ఉండాలి. ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా పోలీస్ శాఖలో వినియోగిస్తున్న వాహనాలను తనిఖీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇట్టి వాహనాల డ్రైవర్లకు పలు సూచనలను చేశారు.నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే క్రమంలో వాహనాల కండిషన్ ఎప్పటికప్పుడు మంచిగా ఉండేలా చూసుకోవాలని సూచించారు.విధుల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని,డ్రైవింగ్ చేసే సమయాల్లో పాటించే నియమ నిబంధనలను కచ్చితంగా అనుసరించాలని తెలిపారు.అకస్మాత్తుగా వాహనం ఆగిపోయినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి అట్టి ఆటంకాలను నివృత్తి చేసుకోగలిగేలా కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలని సూచించారు.క్రమశిక్షణతో,నిబద్ధతతో పని చేసే వారికి పోలీస్ శాఖలో మంచి పేరు లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ మోటారు వాహనాల అధికారి సుధాకర్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, హోమ్ గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు మరియు ఇతర అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ