తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం హేమచంద్రపురం నుండి కారుకొండ రామవరం వెళ్లే బైపాస్ లో ఉన్నటువంటి S మలుపు దగ్గర చాలా లారీలకు ప్రమాదాలు ఎదురువుతున్నాయి. టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామం లో ఉన్న ఓసి నుండి వస్తున్నటువంటి బొగ్గు లోడు లారీలు క్రమంగా టర్నింగ్ దగ్గరే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ మలుపుని ఎప్పుడో తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం డబల్ రోడ్డును, సెంట్రల్ లైటింగ్ ని శాంక్షన్ చేసే క్రమంలో అధికార ప్రభుత్వం అధికారం లో ఉంది అన్న ధీమాతో కొంతమంది అధికార ప్రజాప్రతినిధులు రోడ్డు వెళ్డల్పు జరిగితే వారి స్థలాలు పోతాయని అడ్డుకుంటున్నారు అని స్థానికుల సమాచారం. ఈ సమస్యకు ఏదోఒక పరిష్కారం దొరికేదాక ఈ ప్రమాదాలు గురికావాల్సిందే అని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దరిదాపుగా నెలలో కనీసం 4 ప్రమాదాలు జరుగుతున్నాయి అని ప్రజలు తెలిపారు. ఇది ఇలాగే కొనసాగితే ప్రమాదాలు నివారించడం చాలా కష్టంగా మారుతుందని స్థానిక శాసనసభ్యులు గారు ఏదైనా చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ