తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటేరియన్ సురవరం సుధాకరరెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు అన్నారు. సీపీఐ జూలూరుపాడు మండలం సమితి ఆధ్వర్యంలో సూరవరం సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సీపీఐ జిల్లా సమితి సభ్యులు గుండె పిన్ని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సురవరం ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారన్నారు. . సురవరం సుధాకర్‌రెడ్డి 1942, మార్చి 25న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కాన్‌రేవ్‌పల్లిలో జన్మించారు. ఆయన తండ్రి వెంకట్‌రామ్‌రెడ్డి. తెలంగాణ వైతాళికుడు, గోల్కోండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి స్వయాన సుధాకర్‌రెడ్డికి పెదనాన్న అవుతారన్నారు.ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా, అనంతరం కాలంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, జాతీయ అధ్యక్ష ప్రధాన
Admin
తెలుగు వెలుగు టీవీ