Monday, 20 April 2026 01:31:55 PM
# అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ.

ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో మేయర్ కు అభినందనలు

Date : 05 March 2026 06:09 PM Views : 279

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడండి ...సభ్యుల వినతి ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్తగూడెం మేయర్ గా ఎన్నికైన మూడ్ గణేష్ ను కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో సభ్యులు గురువారం ఆయన ఛాంబర్ లో ఘనంగా సత్కరించి సన్మానించారు. మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా పర్యావరణవేత్త మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ.. కార్పొరేషన్ పరిధిలో పెంచే మొక్కలపైన అవగాహన కల్పించేందుకు తాము సిద్ధంగా ఉంటామని వెల్లడించారు. పదేపదే నాటడం మళ్ళీ తిరిగి నరకడం కాకుండా పకడ్బందీగా ప్లాన్ చేయాలని కోరారు. కోతుల సమస్యను అరికట్టేందుకు కొన్ని సలహాలను సూచనలను అందజేశారు. కొత్తగూడెంలో మోడల్గా కోతులకు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయడం ద్వారా, కోతల సమస్యను అరికట్టవచ్చని సూచించారు. గణేష్ మాట్లాడుతూ పర్యావరణ వేత్తల, ప్రకృతి ప్రేమికుల, పై స్థాయి అధికారుల సూచనల సలహాల మేరకు దానికి పరిష్కారం త్వరలోనే కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా సభ్యులు మేయర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం కో_ఆర్డినేటర్ జి. సుగుణారావు, పర్యావరణ వేత్త మొక్కల వెంకటయ్య, రిటైర్డ్ సింగరేణి జి.ఎం. శనగ వెంకటేశ్వర్లు, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, రామవరం పరిరక్షణ సమితి అధ్యక్షులు ముస్తఫా, మొక్కల ప్రేమికురాలు నైనిక రజువా, గౌరవ సభ్యులు దయసాగర్, బంగారీ శంకర్, నంది శశి కుమార్, జర్నలిస్ట్లు శనగ రామచందర్, దశరధరజువా, ఝాన్సీ లు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :