తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాలలో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాలతో పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించిన పోలీస్ అధికారులు ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఆదేశాల మేరకు చైతన్యం - డ్రగ్స్ పై యుద్ధం అవగాహనా కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న పాన్ షాపుల్లో పోలీస్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది.నిషేదిత గంజాయితో పాటు ఇతర మత్తు పదార్ధాలను నిర్మూలనే లక్ష్యంగా నిత్యం ఇలాంటి తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తెలియజేసారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, మణుగూరు మరియు భద్రాచలం సబ్ డివిజన్ల వారీగా డిఎస్పీల ఆధ్వర్యంలో పోలీస్ జాగిలాల సహాయంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.జిల్లాలో ఇప్పటికే గుర్తించిన గంజాయి హాట్ స్పాట్ నందు కూడా ఇట్టి తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు.ఎవరైనా నిషేదిత గంజాయి వంటి మత్తు పదార్దాలను విక్రయించడం గానీ,రవాణా చేయడం గానీ,సేవించడం గానీ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదే విధంగా వీటితో పాటు ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు గానీ,డయల్ 100 కు గానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. మన జిల్లాను మాదక ద్రవ్య రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీస్ శాఖకు ప్రజలు కూడా సమాచారం అందించి సహకారం అందజేయాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ