తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈనెల 23 నాడు కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగిందని అనంతరం ఫహీమ్ దాదా మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ -స్కాలర్షిప్స్ బకాయిలు చెల్లించక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక ఇటు ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వక పై చదువులు చదువుకోవాలన్న చదవలేని స్థితిలో విద్యార్థినీ విద్యార్థులు ఉన్నారని 7వేల కోట్లు పైకి ఫీజు రివంబర్స్మెంట్ -స్కాలర్షిప్స్ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం బకాయి ఉందని గత బిఆర్ఎస్ ప్రభుత్వం బకాయిలు విడుదల చేయక విద్యార్థిని విద్యార్థుల ఉసురు పోసుకుందని అదే దారిలో కాంగ్రెస్ ప్రభుత్వం నడవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ చెప్పిందని ఇప్పటివరకు చేయకపోవడం బాధాకర విషయం అని రేపు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంతో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బచాయిలు చెల్లించి చిత్తశుద్ధి చూపించాలని లేనిపక్షంలోఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో రసూల్ పాషా,రణధీర్, శివ,నాగరాజు వెంకట్,విజయ్ కాంత్, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ