Thursday, 25 June 2026 08:05:00 AM
# ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఐదుగురికి జైలు శిక్ష. # అన్నదాన కార్యక్రమాలను ప్రోత్సహించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మహిళ ఆత్మహత్య. # ములకలపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సీనియర్ రిపోర్టర్ అపర్ణ మృతి దిగ్భ్రాంతిని కలిగించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # మణుగూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అభివృద్ధికి సిఎస్ఆర్ నిధుల ద్వారా రూ.1.45 లక్షల చెక్కు అందజేత – జిల్లా కలెక్టర్ అంకిత్. # ఎస్‌ఐఆర్ ప్రక్రియ విజయవంతానికి రాజకీయ పార్టీలు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాబోయే భారీ వర్షాల దృష్ట్యా DDRF, అగ్నిమాపక శాఖల శిక్షణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్. # స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్. # విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్ . # మొహరం పండుగ త్యాగానికి, సత్యానికి నిదర్శనం.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # బిజెపిలో పనిచేసే సామాన్యులకే ప్రాధాన్యత నిస్తుంది.బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా గాయత్రి. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి జనసేన పార్టీలో భారీ చేరికలు. # కొత్తగూడెం-జగ్గయ్యపేట రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించండి.కేంద్ర, రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రులకు లేఖలు సమర్పించిన ఎమ్మెల్యే. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి. # నీట్ పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ రోహిత్ రాజు పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 163 BNSS అమలులో ఉంటుంది. # భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం. జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి. # ప్రాధాన్యతా రంగాలకు రుణాల మంజూరును పెంచాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. రూ.8,914 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ . # నీట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు – పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్.

స్వయం ఉపాధి, జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి – సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్.

Date : 22 June 2026 07:38 PM Views : 100

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా చర్యలు. ఆదివాసీ, పీవీటీజీ కుటుంబాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలి.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో అమలు చేస్తున్న ప్రత్యేక జీవనోపాధి కార్యక్రమాల అమలులో వేగం పెంచాలని, లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం (టీఐఎల్‌పీ) మరియు తెలంగాణ సామాజిక అభ్యున్నతి కార్యక్రమం (టీఎస్‌డీపీ) అమలు పురోగతిపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐడీఓసీ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన లబ్ధిదారులకు జీవనోపాధి అవకాశాల కల్పన, ఉత్పాదక ఆస్తుల పంపిణీ, గ్రామస్థాయిలో కార్యక్రమాల అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల అమలులో జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపట్టి లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు.లబ్ధిదారుల కుటుంబాలకు ఆధార్ నమోదు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు, రేషన్ కార్డులు, గృహాల మంజూరు, ఆరోగ్య సేవలు, టీకాల కార్యక్రమాలు తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.వ్యవసాయ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖలతో సమన్వయం పెంచి కుటుంబాలకు బహుళ జీవనోపాధి అవకాశాలు కల్పించాలని, పశువైద్య శిబిరాలు, పోషకాహార తోటలు, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేయాలని తెలిపారు. అలాగే అటవీ ఉత్పత్తుల ఆధారంగా ఇప్పపువ్వు, తేనె సేకరణ, తేనెటీగల పెంపకం, వెదురు సాగు వంటి కార్యక్రమాలను ప్రోత్సహించి ఆదివాసీ కుటుంబాల ఆదాయ వనరులను పెంపొందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.ఆదివాసీ, పీవీటీజీ (అత్యంత వెనుకబడిన గిరిజన) కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేసి ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలో తెలంగాణ సమగ్ర జీవనోపాధి కార్యక్రమం కింద గుండాల మండలంలో 800, దుమ్ముగూడెం మండలంలో 800, పినపాక మండలంలో 865, చర్ల మండలంలో 865 కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. ఆయా కుటుంబాలకు జీవనోపాధి అవకాశాలు కల్పించడం, సంక్షేమ పథకాల అనుసంధానం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డిఆర్డిఓ విద్యాచందన, ఏపీఎం వెంకయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :