తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎండ తీవ్రత ప్రాంతాల్లో సింగరేణి యాజమాన్యం రోడ్లపై నీళ్లు చల్లాలని అలాగే మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని 16 వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ డిమాండ్ చేశారు. డివిజన్ లో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఓపెన్ కాస్ట్ ల పేరుతో అడవులను నరకడం దానికి తగ్గట్టుగా సమతుల్యాన్ని పాటిస్తూ అడవులను పెంచక పోవటం వల్ల ఎండ తీవ్రత ఉష్ణోగ్రత పెరిగి ప్రజలు వడదెబ్బతో చనిపోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరియు మరొకవైపు చెట్లను నరికి ఆ ప్రాంతాల్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం వల్ల సోలార్ ప్లాంట్ తో రామవరం మొత్తం అగ్నిగుండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం గతంలో 50 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కార్మిక వాడల్లో రోడ్లపై నీళ్లు చల్లేవారని తక్షణమే సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మిక వాడల్లోని రోడ్లపై నీళ్లు చల్లారని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రామ్ రాకేష్, వాసం బాబు, ఉపతల శీను, గుంజ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ