తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మే 18 నుండి 23 వరకు నిర్వహించనున్న టూరిజం వారోత్సవాల సందర్భంగా “యువ టూరిజం క్లబ్” పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, యువత టూరిజం రంగంపై అవగాహన పెంపొందించుకొని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు యువతలో పర్యాటక ప్రదేశాల పట్ల ఆసక్తి పెంచడంతో పాటు వారసత్వ సంపద పరిరక్షణపై అవగాహన కల్పిస్తాయని తెలిపారు. టూరిజం వారోత్సవాల సందర్భంగా జిల్లాలో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మే 19న పాల్వంచలోని కిన్నెరసాని ప్రాజెక్ట్ వద్ద టూరిజం అవేర్‌నెస్ డ్రైవ్, మే 20న లక్ష్మీదేవిపల్లి మండలంలోని కారుకొండ రామవరం బౌద్ధ రాక్ కేవ్స్ వద్ద హెరిటేజ్ వాక్, మే 21న జిల్లాలోని యూట్యూబర్లతో సమావేశం, మే 22న బౌద్ధ రాక్ కేవ్స్ ప్రాంతంలో స్వచ్ఛత డ్రైవ్, మే 23న పాల్వంచలోని ఐడాక్‌లో బ్రాండ్ కిట్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు .టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ మ్యూజియాలజీ” మరియు “సర్టిఫికేట్ కోర్స్ ఆన్ ఆర్కియాలజీ” కోర్సులను యువత వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కోర్సుల ద్వారా పర్యాటక, పురావస్తు, మ్యూజియం రంగాల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చని తెలిపారు.కోర్సులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి. నాగరాజును సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9849905722, 9849905723
Admin
తెలుగు వెలుగు టీవీ