తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ప్రధాన జిల్లా స్పెషల్ న్యాయమూర్తి జి.ప్రేమలతను కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ ముధల్కర్ సభ్యులతో పాటు ఈసీ మెంబర్లు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు జడ్జి ఛాంబర్ లో జడ్జి జి.ప్రేమలతను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.ఈ సంధర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ ముదల్కర్ మాట్లాడుతూ జిల్లా న్యాయమూర్తికి,న్యాయవాదులకు న్యాయవాదులందరం అన్ని విధాల సంపూర్ణ సహాయ,సహకారాలు అందిస్తామన్నారు.న్యాయవస్థ అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు.న్యాయ వ్యవస్థకు,ప్రజలకు మధ్య మంచి వాతావరణం నెలకొనేలా అందరము కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు-1 షేక్ సాజహన్ పర్వీన్,ఉపాధ్యక్షులు -2 కాటూరి సంజీవ్ రావు,ప్రధాన కార్యదర్శి గడిపెల్లి మహేష్ జాయింట్ సెక్రటరీ గాడదాసు నాగరాజు,క్రీడల కార్యదర్శులు బానోత్ దేవదాసు,నకరాకంటి ఉమ, మహిళా ప్రతినిధి మల్లెల ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ