Tuesday, 21 April 2026 06:17:52 PM
# మహిళలకు శుభవార్త అందించిన సర్పంచ్ ఇస్లావ త్ రుక్మిణి. # ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలి – ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి. # అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA,BRS పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నేడు అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. # వైద్య ఖర్చులకు లక్ష రూపాయల ఎల్ఓసి మంజూరు చేసిన ఎమ్మెల్యే జారె. # మహా కుంభాభిషేకానికి రావాల్సిందిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన ఎమ్మెల్యే జారె. # గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు.

రైతు కృష్ణ కుటుంబానికి రూ. 10లక్షల ఎక్స్గ్రెషియా చెల్లించాలి

Date : 01 April 2025 08:11 PM Views : 773

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం ఏప్రిల్ 1(తెలుగువెలుగు) సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోందడరెడ్డి లు మాట్లాడుతూ బహుళ జాతుల కంపెనీ లు రైతు జీవితాలను బలిగొంటున్నాయని గత రెండు రోజుల క్రితం మరణించిన రైతు కృష్ణ కుటుంబానికి, భారతి విత్తన కంపెనీ రూ. 10లక్షల ఎక్స్రేషియ చెల్లించాలని, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లమల్ల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం జూలూరుపాడు మండలంలోని వినోభానగర్ గ్రామాన్ని, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావుతో కలిసి సందర్శించి మృతి చెందిన గిరిజన రైతు జర్పుల కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. భార్య రాజ్యలక్ష్మి, ఇద్దరు పిల్లలను ఆయన ఓదార్చారు. రైతు మృతి చెందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు సమగ్ర విత్తనపు చట్టాన్ని తీసుకురావాలని రైతుసంఘాలు, రాజకీయ పార్టీలు ఎన్నో ఏళ్లగా పోరాటాలు - నిర్వహిస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలుచేయకపోవటంతో, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నదని ఎన్ వి ఆవేదన వ్యక్తం చేశారు. . కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని అమలు చేయకపోతే కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయిన రాష్ట్ర ఫరిదిలో ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మొక్కజొన్న విత్తన కంపెనీల యాజమాన్యాలు దళారుల ప్రమేయంతో రైతులను మభ్యపెట్టి పంటలను సాగుచేయించి మోసం చేస్తున్నాయని ఎన్వీ ఆరోపించారు. రైతు కృష్ణ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులను మొక్కజొన్న విత్తన కంపెనీలు దగా చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చూస్తున్న చిన్న చూపు వల్ల బహుళజాతి కంపెనీలు రైతులను మోసగిస్తున్నాయని సంయుక్త కిసాన్మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు ఆరోపించారు. కంపెనీల దోపిడి, గిరిజన రైతు మృతి తదితరాలను రైతు సంక్షేమ కమిషన్‌ చైర్మన్‌ కోందడరెడ్డికి విన్నవిస్తామని ఎన్ వి అన్నారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్ని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. మృతి చెందిన రైతు జర్పుల కృష్ణ, కుటుంబంలో సంపాదించే ఏకైక వ్యక్తి అని, మృతునికి భార్య ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని, బహుళ జాతి కంపెనీలు మృతుని కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎన్.వి డిమాండ్ చేశారు. రైతులకు ముందస్తు పెట్టుబడి ఆశచూపి, వారిని మభ్యపెట్టి మొక్కజొన్న పంటలను సాగుచేయించి వడ్డీతో సహ రైతుల వద్ద నుంచి వసూళ్లు చేస్తున్నారని, దీంతో రైతులకు ఏమి మిగలకపోవడంతో నష్టపోతున్నారని అన్నారు. రైతులకు ఎలాంటి అగ్రిమెంట్ చేయకుండానే కంపెనీ యాజామాన్యం, దళారులు దోచుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కంపెనీల విధానాలతో రైతులు నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి జిల్లా వ్యవసాయ శాఖాధికారి బాబురావు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :