తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 15(తెలుగు వెలుగు) జూలూరుపాడు మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా జూలూరుపాడు ,ఏనుకూరు సరిహద్దు అటవీ ప్రాంతం మున్యా తండా గ్రామ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరించుచున్నదని అటవీ శాఖ అధికారులు దృవీకరించినందున ప్రజలు ఒంటరిగా బయటకు రాకూడదని రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగకూడదని అటవీ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో పొలాలు ఉన్న రైతులు అప్రమత్తంగా ఉండాలని , ప్రజలు భయభ్రాంతులకు గురి కావద్దని జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి తెలియచేసారు.
Admin
తెలుగు వెలుగు టీవీ