తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ పాండురంగ భజన మందిరం లో ఈరోజు అనగా 06-05-2025 మంగళవారం నుండి 10-05-2025 ఆదివారం వరకు ప్రతి రోజూ సాయంకాలం 6:30 నుండి 08:00 గంటల వరకు సుందరకాండ ప్రవచనములు శ్రీ లట్టి జగన్మోహన్ చే నిర్వహించడం జరుగుతున్నది...ఈరోజు 06-05-2025 సాయంకాలం 6:30 గంటల నుండి ఏకాదశ హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించి.,ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగినది. ఇట్టి కార్యక్రమం లో సదరు దేవస్థాన కార్యనిర్వహాణాధికారి కె సులోచన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఇట్టి కార్యక్రమం గురించి సందేశాన్ని అందించారు.దేవస్థాన అర్చకులు వేదుల శ్రీ రామ చంద్ర మూర్తి, శ్రీ రంగం వెంకట రమణ చార్యులు, శ్రీరంగం రంగా చార్యులు, కాంజర్ల మధు కుమార చార్యులు, పండిత్ దినేష్ కుమార్ శర్మ.సుందరకాండ పారాయణం గురించి సందేశాన్ని అందించినారు. ఇట్టి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సుందరకాండ ప్రవచనన్ని భక్తి శ్రద్ధలతో వినీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, స్వామి వారి కృపకు పాత్రులు ఐనారు....జై శ్రీ రామ్
Admin
తెలుగు వెలుగు టీవీ